అమ్మ ఫౌండేషన్ ఆశయాల్లో భాగస్వాములు కావాలి
ప్రజలకు, యువతకు పిలుపునిచ్చిన మంతెన మణి
కాకతీయ, జనగామ : సమాజంలో ఆకలి చావులు లేని భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా అమ్మ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో ప్రజలు, యువత భాగస్వాములు కావాలని జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణీకుమార్ పిలుపునిచ్చారు. రఘునాథపల్లి మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చింతకింది కృష్ణమూర్తి–రాజేశ్వరి దంపతుల కుమార్తె చింతకింది స్ఫూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని, జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రి వద్ద చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులకు మహా అన్న సమర్పణ నిర్వహించి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపించారు.ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణీకుమార్, ప్రధాన కార్యదర్శి వంగ భీమ్ రాజు మాట్లాడుతూ… స్ఫూర్తి చిట్టితల్లికి అమ్మ ఫౌండేషన్ టీం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సేవా కార్యక్రమానికి ముందుండి సహకరించిన సీనియర్ జర్నలిస్టు చింతకింది కృష్ణమూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ ఫౌండేషన్ ఆలోచన, ఆశయాల్లో భాగంగా దేశంలో ఆకలి చావులు లేకుండా నియంత్రించాలన్న లక్ష్యంతో నిరాశ్రయులు, అనాధలు, నిరుపేద కుటుంబాలు, మానసికంగా అశక్తులైన వారికి తోచినంత సహాయం అందిస్తూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజలు, యువత చురుగ్గా పాల్గొని అమ్మ ఫౌండేషన్ సేవలను విస్తృతం చేయాలని కోరారు. సేవా కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కొయ్యడ రవి, బింగి నరసింహులు, ఎండి యాకూబ్, కొయ్యడ విశ్వతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.


