కాకతీయ, కరీంనగర్ బ్యూరో: నేరస్థులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సీపీ అంబర్ కిషోర్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేరస్థులకు శిక్షపడే విధంగా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావు గా జరిగేలా చూడాలని సీపీ సూచించారు. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా మానవత్వంతో మెదలాలని, దోషులకు శిక్ష పడడంతో కోర్టు కానిస్టేబుళ్ల బాధ్యత చాలా కీలకమైనదని, నేరస్థులకు వారెంట్స్, సమన్లు సత్వరమే ఎగ్జిక్యూట్ అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
కోర్టు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు తెలియజేయాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు, సూచనలు పాటించాలని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న ట్రయల్ కేసులు, వారెంట్లు, సమన్లు సీసీటీఎన్ఎస్లో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు.
ఏప్రిల్ 26, 2022న భీమారానికి చెందిన మూగ, చెవిటి అమ్మాయిని మానభంగం చేసిన పోక్సో కేసులో శ్రీరాంపూర్ కు చెందిన అనువాదకుడు కే.యోసేపు కోర్ట్ లో బాధితురాలు తెలిపిన సైగలను అనువాదం చేసి కోర్ట్ లో సాక్ష్యం చెప్పారన్నారు. ఈ కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 12,500 జరిమానా, బాధితురాలికి రూ.7 లక్షల పరిహారాన్ని ఇవ్వవలసిందిగా తీర్పునివ్వాలన్నాను. కే
సులో నిందితుడికి శిక్ష పడడంలో కీలకమైన కే. యోసేపును సీపీ సన్మానించారు. సమావేశంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, లీగల్ సెల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, సిసి ఆర్ బి ఎస్ఐ చంద్ర కుమార్, సిసి హరీష్, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పాల్గొన్నారు.


