మున్సిపల్స్‌లో సత్తా చాటాలి
ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
జిల్లా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కమిటీ సన్నాహక సమావేశం
ముఖ్య నేతలకు ప్రసిడెంట్ దిశానిర్దేశం
కాకతీయ, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కమిటీ సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా నూతి సత్యనారాయణ గౌడ్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో గతంలో మూడు మున్సిపాలిటీలు ఉండగా… ఇప్పుడు రెండు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయన్నారు. ఈ ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. ఆ దిశగా ప్రజాపాలన అందిస్తున్న ఫలాలు ఓటర్లకు వివరించాలని ముఖ్య నాయకులను కోరారు. అదే విధంగా ముఖ్య నాయకులు ఈ ఐదు మున్సిపాలిటీలలో పార్టీ విజయం కోసం పాటుపడుతూ అన్ని వర్గాల నాయకులను సమన్వయ పరుస్తూ పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్ఈ పోట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాద్యక్షులు వడ్డేబోయిన నరసింహారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు పగడాల మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా సేవాదళ్ అద్యక్షులు సయ్యద్ గౌస్, జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ సూచనల మేరకు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తంచేశారు. నాయకులను సమన్వయ పరుస్తూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లోని ముఖ్య నాయకులు, డివిజన్ అద్యక్షులు పాల్గొన్నారు.


