స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
కాకతీయ, రామకృష్ణాపూర్ : రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ సత్తాను చాటాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. సోమవారం క్యాతన్ పల్లిలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సుమన్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన మంద వేణుగోపాల్,అకిరెడ్డి రాంబాబు లతో పాటు పలువురికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ పల్లె భూమేష్,రాజా రమేష్,పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్,ఆత్మకూరి మహేందర్,మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


