epaper
Monday, March 2, 2026
epaper

మెస్సీని మిస్ అయ్యాం..

మెస్సీని మిస్ అయ్యాం..

మెస్సీ కోల్‌కతా పర్యటనలో గందరగోళం

అలావ‌చ్చి ఇలా వెళ్లిన ఫుట్‌బాల్ దిగ్గ‌జం

అభిమానుల ఆగ్ర‌హం.. స్టేడియంలో ర‌చ్చ‌

కుర్చీలు, వాటర్ బాటిల్లు విసిరి ఆందోళ‌న‌

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ది గోట్ టూర్‌‌లో భాగంగా మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చాడు. శనివారం తెల్లవారు జామున కోల్‌కతాలో ల్యాండ్ అయ్యాడు. షెడ్యూల్ ప్రకారం అతడు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీంతో ఆయ‌న్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. మెస్సిని దగ్గరి నుంచి చూడాలని.. ఆటను వీక్షించాలని అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. అయితే మెస్సి మాత్రం.. మ్యాచ్ ఆడకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. అలా వచ్చి.. ఇలా మైదానం వీడాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మెస్సి కోసం వస్తే.. పది నిమిషాలు కూడా లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిల్లు విసిరేశారు. దీంతో సాల్ట్ లేక్ మైదానంలో ఊహించని పరిణామాలు జరిగాయి.

చేతులెత్తేసిన నిర్వాహ‌కులు

స్టేడియంలో గందరగోళ పరిస్థితుల మధ్య ముందుగా నిర్ణయించిన ఈవెంట్లను నిర్వాహకులు.. నిర్వహించలేకపోయారు. అయితే మెస్సిని చూసేందుకు రూ.1000కి పైగా టికెట్ కోసం వస్తే.. అతడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడు మైదానం వీడిన మరుక్షణమే స్టేడియంలోకి దూసుకొచ్చి.. టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు. అక్కడి సిబ్బంది వారిని నియంత్రించలేకపోయారు. కాగా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఘటనలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా మెస్సికి, అతడి అభిమానులకు క్షమాపణ చెప్పారు. స్టేడియంలో జరిగిన నిర్వహణ లోపాన్ని చూసి.. షాక్ అయినట్లు చెప్పారు. మెస్సిని చూసేందుకు తాను కూడా బయలుదేరానని.. కానీ అక్కడి పరిస్థితి గురించి తెలుసుకుని వెనుదిరిగినట్లు పేర్కొన్నారు. నిర్వహణ వైఫల్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కోసం జస్టిస్ అషిమ్ కుమార్ అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img