కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగడుతున్నాం
బిజెపి నేత మాజీ మేయర్ సునీల్ రావు
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ బీజేపీ కరపత్రాల పంపిణీ, సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిపోయాయని, మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం గానీ, వృద్ధులు–వికలాంగుల పెన్షన్‌ను ₹4,000, ₹6,000లకు పెంచుతామని చెప్పినా అమలు చేయలేదని విమర్శించారు. చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి కూడా మాట తప్పిందన్నారు.అదేకాగా బస్ చార్జీలు భారీగా పెంచడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం, రైతుల పంటలు కొనలేని పరిస్థితి నెలకొనడం, గ్రామ,పట్టణాలకు ఒక్క రూపాయి ప్రత్యేక నిధులు కూడా విడుదల చేయకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ప్రజలను వంచించడం ఇవన్నీ కాంగ్రెస్ వైఫల్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు.ప్రజలు కూడా కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొంటున్న మోసాలను కార్యక్రమంలో విస్తృతంగా వివరించినట్లు తెలిపారు. వచ్చే సందర్భంలో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొంతల ప్రవీణ్, ఉపేందర్, పండుగ నాగరాజు, శ్రీనివాస్ గాంధీ, రాజ్ ప్రభాకర్, కుంభం అనిల్, హమీద్, బాలూ, బీమారి సత్యం, శ్రీకాంత్, మేకల కిరణ్, మహేందర్‌తో పాటు అనేకమంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.



