కాకతీయ, నేషనల్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల సమయంలో ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో వేప చెట్టు కూలిపోవడంతో ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ చెట్టు 100 సంవత్సరాల పురాతనమైనదని అధికారులు తెలిపారు. కారు, బైక్ చెట్టు కింద నుంచి వెళ్తున్న సమయంలో చెట్టు కూలిపోయింది. సమయంలో కారులోని వ్యక్తులు, బైక్ పై వెళ్తున్న వ్యక్తి చెట్టు కింద కూరుకుపోయారు. జేసీబీ సహాయంతో చెట్టు వేర్లు తొలగించారు.
చెట్టు కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెట్టు కూలిపోవడంతో బైకర్ మరణించగా, అతని వెనుక కూర్చున్న మహిళ చెట్టు కింద ఇరుక్కుపోయింది. మృతుడిని 55 ఏళ్ల సుధీర్ కుమార్ గా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో బైక్ నడుపుతున్న ఒక మహిళ చెట్టు కింద నలిగిపోయినట్లు కనిపిస్తుంది. వీడియోలో ఒక చెట్టు కారుపై పడిపోయినట్లు కూడా చూడవచ్చు. స్థానికులు ఆ మహిళనురక్షించారు. ఆమెకు కూడా గాయాలు అయ్యాయి.
Heartbreaking scene in Delhi’s Kalkaji area where heavy rain caused a tree to fall trapping a girl between her bike and the tree.
Instead of helping the crowd is more focused on recording videos.
Why are we so quick to capture moments rather than act in emergencies?… pic.twitter.com/ZJ0glHmwV5
— Arshu (@im__Arshu) August 14, 2025
గురువారం ఉదయం నుండి ఢిల్లీలో వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ ‘ఆరెంజ్’ హెచ్చరిక జారీ చేసి భారీ వర్షం పడుతుందని హెచ్చరించింది. వర్షం కారణంగా ఢిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం రద్దీ సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది. వాతావరణ శాఖ ప్రకారం గురువారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల వ్యవధిలో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో 13.1 మిమీ, అయా నగర్‌లో 57.4 మిమీ, పాలంలో 49.4 మిమీ, లోధి రోడ్‌లో 12 మిమీ, ప్రగతి మైదాన్‌లో 9 మిమీ , పూసాలో 5 మిమీ వర్షపాతం నమోదైంది.


