లక్ష్మణ్ తండా గ్రామ పంచాయతీలో 2వ వార్డు ఏకగ్రీవం
దేవరుప్పుల మండలంలో కాంగ్రెస్ బోణీ
వార్డు సభ్యుడు బానోతు పకీర్‌కు అభినందనలు
కాకతీయ, జనగామ: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మణ్ తండా గ్రామ పంచాయతీలో 2వ వార్డు ఏకగ్రీవమై కాంగ్రెస్ బోణీ కొట్టింది. లక్ష్మణ్ తండా గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన 2వ వార్డు అభ్యర్థిగా బానోతు పకీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోగా పకీర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో మండలంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఏకగ్రీవాల్లో బోణీ కొట్టినట్లయింది. కాగా ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ వార్డు సభ్యుడు పకీర్.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌గా గుర్తింపు ఉన్న పకీర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవంగా తన ఎన్నికకు సహకరించిన వారందరికీ పకీర్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా వార్డు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన తెలిపారు.


