రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో వరంగల్ విజయకేతనం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో పురుషుల విభాగంలో వరంగల్ జట్టు గెలుపొందారు. మహిళల విభాగంలో వరంగల్ మహిళా జట్టు రన్నరప్ నిలిచారు. ఈ విజయాలతో వరంగల్ వాలీబాల్ సంఘానికి గర్వకారణమైందని , జిల్లా విజయాలకు అర్హత సాధించిన ఆటగాళ్లు, కోచ్‌ల కృషి ప్రతిఫలంగా నిలిచాయని రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల రమేష్ బాబు అభినందించారు.ఈ విజయాలతో వరంగల్ ప్రాంత క్రీడావేత్తల ఉత్సాహం మరో స్థాయికి చేరింది.
ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, మీరిపెల్లి రాజు, తీగల శ్రీనివాస్, జై బాబు, రఘువీర్, కృష్ణ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర బాధ్యులు కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.


