కాకతీయ, వరంగల్ సిటీ : ప్రతి సంవత్సరం వరంగల్ లో భారీ వర్షాల వరదల వలన లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. కానీ ఈసారి రైల్వే స్టేషన్ వంతు అయింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి వరంగల్ రైల్వే స్టేషన్ వరద నీటిలో మునిగిపోయింది. వర్షపు నీటి వలన రైల్వే స్టేషన్లో ఉన్న మూడు లైన్ల పట్టాలు నీట మునిగాయి, వేగవంతంగా రైల్వే సిబ్బంది నీటిని బయటికి పంపిస్తున్నారు. పలు రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చెరువును తలపిస్తున్న వరంగల్ రైల్వే స్టేషన్..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


