కాకతీయ, వరంగల్ సిటీ: వరంగల్ లో కురుస్తున్న భారీ వర్షానికి ఖిలా వరంగల్ మండల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతాలు నీట మునిగాయి, వెంటనే అప్రమత్తమైనా మిల్స్ కాలనీ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
వరద నీటిలో చిక్కుకున్న చిన్నారులని మిల్స్ కాలనీ సీఐ రమేష్, పోలీస్ సిబంది, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరు భయపడాల్సిన అవసరం తెలిపారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఏదైనా సహాయం కొరకు మిల్స్ కాలనీ పోలీసులను సంప్రదించాలని, నిరంతరం ప్రజల శ్రేయస్సు కొరకు పోలీసులు అందుబాటులో ఉంటామని మిల్స్ కాలనీ సిఐ రమేష్ తెలిపారు.


