కాకతీయ, వర్ధన్నపేట : పోలీసు శాఖ వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్, సీసీటీఏన్ఏస్ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని సిపి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, అనుమానితులు,కేడీ,డీసీలు, మిస్సింగ్, ఆస్తి నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి పోలీస్ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి.
ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా బాధితుల ఫిర్యాదులు ఆలకించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తనిఖీల అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.ఈ తనిఖీల్లో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య వర్ధన్నపేట సిఐ శ్రీనివాస్, రావు ఎస్.ఐలు సాయి బాబు, రాజు పాల్గొన్నారు.


