జఫర్గడ్ ఎస్సై పై వరంగల్ సీపీ సస్పెన్షన్ వేటు
కాకతీయ, వరంగల్ బ్యూరో : జనగామ జిల్లా వర్ధన్నపేట ఏసీపీ పరిధిలోని జఫర్గడ్ ఎస్సై రామ్ చరణ్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషన్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జఫర్గడ్ ఎస్సైగా పనిచేస్తున్న రామ్ చరణ్ ఫిర్యాదారుల నుండి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు ఉన్నత అధికారులు విచారణ జరిపి సీపీకి నివేదిక అందించారు. సిపీ కి అందిన నివేదిక మేరకు రామ్ చరణ్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మహుబూబాద్ జిల్లా పెద్దవంగర ఎస్సైగా పనిచేస్తూన్న సమయంలో ఉప్పరగూడెం గ్రామ సర్పంచ్ భర్తను కొట్టినట్లు ఆరోపణలు రావడంతో గతంలో ఒకసారి సస్పెండ్ కు గురయ్యారు.


