గోడపత్రిక ఆవిష్కరణ
కాకతీయ, నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఆలయ ప్రాంగణంలో గోడపత్రికను ఆవిష్కరించారు. శ్రీ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటో తేదీ నుండి ఆరో తేదీ వరకు జరుగునట్లు ఆలయ చైర్మన్ వేముల విజయ పాల్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి వెంకట్రావు తెలిపారు. మార్చి 4వ తేదీన శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం రాత్రి 8 గంటలకు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు గాడుదుల సోమలింగం, మధుసూదన్, సుధాకర్ రెడ్డి, జ్యోతి, అర్చకులు నందనాచార్యులు, రామాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ మార్కశేఖర్, గ్రామ పెద్దలు జునుకల రమేష్, ఉప సర్పంచ్ కాస యాకయ్య,షేరు గోపి సిబ్బంది పాల్గొన్నారు.


