ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయధం
మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యువత,విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్బంగా మున్సిపల్ మేనేజర్ జాలిగాం ప్రభాకర్ మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని అన్నారు. 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును పొంది ఉండాలన్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మంచి నవ సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో,కార్యాలయ సిబ్బంది, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


