నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం
– మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, దేవస్థానం ప్రతినిధులు
– మార్చి 8 నుంచి 19 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మార్చి 8 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు రావలసిందిగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని దేవస్థానం ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, దేవస్థానం చైర్మన్ బి. రంగాచారి, శ్రీ పల్లెర్ల రవీందర్, కార్యనిర్వహణ అధికారి సహాయకుడు సుధాకర్, రిటైర్డ్ ఉప ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు, పురోహితులు గోపాలకృష్ణ శర్మ కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం అందజేశారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.


