కాకతీయ, గీసుకొండ: శ్రీ మద్విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని పురస్కరించుకొని 16 వ డివిజన్ ధర్మారం రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మారం విశ్వబ్రాహ్మణ సంఘం కన్వీనర్ కొక్కొండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి సొల్లేటి కృష్ణమాచారి హాజరై మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మల్లంతా కలిసికట్టుగా ఉండాలని ఆకాంక్షించారు.
సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు విశ్వబ్రాహ్మణ సంఘము వరంగల్ జిల్లా అధ్యక్షులు బండ్లోజు నరసింహ చారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు వీనవంక సదానందం, తూముగంటి హరినాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్, సిద్ధోజి వీరన్న, విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ వనభోజ మోహన్ రావు, ధర్మారం విశ్వబ్రాహ్మణ సభ్యులు తూముగంటి ప్రభాకర్ తోముగంటి రామేశ్వరరావు ఉప్పుల రాజేందర్, ఉప్పుల ఉపేంద్ర, కట్రోజు షణ్ముఖ చారి, సత్యనారాయణ హరినాథ్ హరికృష్ణ రవీందర్ ధన కంటి నవీన్ కస్తూరి యుగేందర్,కాట్రోజు సత్య నారాయణ,విక్రమ్,పద్మశాలి సంఘం జిల్లా నాయకులు ఎలిగేటి కిష్టయ్య, కొట్టే ముత్తు లింగం, అయ్యగార్లు సాత్విక్ సిద్ధార్థ ఉజ్వల్, శ్రీదేవి, లత,రమాదేవి, స్వరాజ్యం, భాగ్యమ్మ, విశ్వబ్రాహ్మణ సంఘం యువతీ యువకులు పాల్గొన్నారు.


