కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని పలు సమస్యలపై ఎంపీడీవో సింగారపు కుమార్, ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్, మండల వ్యవసాయ అధికారి ఎస్కే యాస్మిన్ అధికారులకు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు చందు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్బిఐ బ్యాంకు ద్వారా పిఎం విశ్వకర్మ పీఎంఈజిపి ముద్ర లోన్లు పెండింగ్లో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి పూర్తిచేసి ఇప్పించాలని బ్యాంకు మేనేజర్ ప్రవీణ్ ను కోరారు.
ఎంపీడీవో తో గ్రామాలలో రోడ్ల పరిస్థితి సమస్యల పైన చర్యలు తీసుకోవాలని ఏవో తో యూరియా కొరత లేకుండా చేయాలని దృష్టి సారించాలని బిజెపి మండల పార్టీ తరఫున విజ్ఞప్తి పత్రాలు అందజేశామని తెలిపారు. కేంద్ర పథకాలను పీఎం ఈజిపి, పీఎం విశ్వకర్మ, ముద్ర పెండింగ్, నూతన లోన్లు త్వరితగతిన సాంక్షన్ చేయాలని.
అదేవిధంగా నూతన రైతు బీమా నమోదు, ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి వలసిన కావాల్సినంత కేంద్రం కేటాయించినప్పటికీ కృత్తిమ కొరత సృష్టిస్తున్నారు కావున వెంటనే యూరియా మండలానికి తగినంత కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు పర్నే ప్రభాకర్ రెడ్డి, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు నల్లని పాపారావు, సుధాకర్, సుందర్, సురేష్, ఐలయ్య, నవీన్, మహేష్, ప్రవీణ్, రమేష్, సందీప్, కృష్ణ, జవహర్లాల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


