epaper
Monday, March 2, 2026
epaper

బంగ్లాదేశ్‌లో హింస‌

బంగ్లాదేశ్‌లో హింస‌
విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్యతో దేశ‌మంతా అల్ల‌ర్లు
విద్యార్థి ఉద్యమ నేతను కాల్చిచంపిన దుండగులు
షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర
భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో వివాదాస్పదం
ఎన్నికల ప్రచారంలో ఉండగానే కాల్పులు
ఢాకా సహా దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : విద్యార్థి ఉద్యమ నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ మరోసారి అల్లకల్లోలంగా మారింది. గతంలో విద్యార్థుల తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన హాదీని దుండగులు కాల్చిచంపడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. నిరసనకారులు రోడ్డెక్కడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఝల్కాతీ జిల్లాలో 1994లో జన్మించిన ఉస్మాన్ హాదీ చిన్ననాటి నుంచే ఉద్యమ భావజాలంతో ఎదిగాడు. విద్యార్థి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అతడు గత ఏడాది జూలైలో అవామీలీగ్, అప్పటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించాడు. ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిన ‘ఇన్‌కిలాబ్ మంచ్’ సంస్థకు కన్వీనర్‌గా వ్యవహరించాడు. హాదీ పలుమార్లు భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించిన మ్యాప్‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడ‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేపథ్యంలో అతడిపై దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.

విద్యార్థుల తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినప్పటికీ, యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇన్‌కిలాబ్ మంచ్‌ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు. వచ్చే జాతీయ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో హాదీ స్వతంత్ర అభ్యర్థిగా ఢాకా-8 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాడు. డిసెంబరు 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆటోలో ప్రయాణిస్తున్న హాదీపై గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని తొలుత ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం అతడు మృతి చెందాడు. తూటా గాయంతో మెదడుకు తీవ్ర నష్టం వాటిల్లిందని వైద్యులు తెలిపారు.

హాదీ మృతివార్తతో ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇన్‌కిలాబ్ మంచ్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మీడియా కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు హాదీ మృతికి సంతాపంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒకరోజు జాతీయ సంతాపదినాన్ని ప్రకటించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img