ఆల్ ఇండియా పోలీసు హాకీ పోటీలకు వినీత్
కాకతీయ,హుజురాబాద్ : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో డిసెంబర్ 4 నుంచి 15 వరకు జరగనున్న ఆల్ ఇండియా పోలీసు హాకీ పోటీలుకి హుజురాబాద్ వాసి, హాకీ క్రీడాకారుడు మోటపోతుల వినీత్ ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లోని ప్రత్యేక సాయుధ రిజర్వు దళంలో (SARCPL) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వినీత్ పోలీసు జట్టు తరఫున ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నాడు.వినీత్ ఎంపికపై హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కార్యదర్శి బొడిగె తిరుపతి, ఉపాధ్యక్షుడు భూసాల శంకర్‌తో పాటు క్రీడాకారులు సాదుల శ్యామ్, సజ్జు, సాయి కృష్ణ, విక్రమ్, రాజేష్, సాంబరాజు వంశీ, వినయ్, పరబ్రహ్మం తదితరులు అభినందనలు తెలిపారు.


