రేవంత్ గెటప్‌లో వినాయక విగ్రహం ఏర్పాటు
సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్..
కాకతీయ, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపంలో ఏర్పాటు చేసిన ఓ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడంపై వివాదం చెలరేగుతోంది. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని అఘాపురాలో ఈ ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోలినట్లుగా ఈ గణపతి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. సీఎం రేవంత్ రెడ్డి పొలికలతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీజేపీ, హిందూ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి.


