కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు సోమవారం పెద్దపల్లి మండలంలోని నిట్టూరు, పెద్దకల్వల, అప్పన్నపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సమగ్ర అభివృద్ధి సాధ్యమని, అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.2 లక్షల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ సభ్యునిగా ఆయన, గ్రామ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి, అభ్యర్థులను సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


