గ్రామ సౌభాగ్యం – బీజేపీతోనే సాధ్యం
రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు
కాకతీయ, పరకాల : భారతీయ జనతా పార్టీ మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా పరకాల నియోజకవర్గం నడికూడ మండల అధ్యక్షుడు ఏరుకల దివాకర్ ఆధ్వర్యం,లో ఇంటింటికి బిజెపి, ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు కార్యక్రమాన్ని చర్లపల్లి గ్రామం,లో బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్. పగడాల కాళీ ప్రసాద్ రావు నడికూడ మండల నాయకులతో కలిసి మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు ప్రజలకు ఇస్తూ డోర్ స్టిక్కర్స్ వేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గోగుల రాజిరెడ్డి,శక్తి కేంద్ర ఇంచార్జ్ మోతె మధుసూదన్ రెడ్డి, బూత్ అధ్యక్షులు అమ్మ అయిలయ్య, ఆరే తిరుపతి, దూదిపాల సుదర్శన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సుధీర్, బండి యాదగిరి, మూల తిరుపతి రెడ్డి, తోట రాజయ్య, మండల కార్యదర్శులు అల్లం వజ్రం, రమేష్,సురేష్, మండల మాజీ ఉపాధ్యక్షులు మామిడాల బుచ్చిరెడ్డి,గౌరు మల్లారెడ్డి, శివకుమార్, రాంప్రసాద్, ఇంద్రసేన రెడ్డి, హరికృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు.


