కేంద్ర నిధులతో గ్రామాభివృద్ధి
బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్
సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
కాకతీయ, శంకరపట్నం : కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ తెలిపారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి కేంద్ర నిధులే కీలకమని పేర్కొన్నారు. మండలంలోని వంకాయగూడెం గ్రామంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకం ద్వారా మంజూరైన రూ.15 లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. సర్పంచ్ వెన్నం మల్లేష్ కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏనుగుల అనిల్ మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామపంచాయతీలు నడుస్తున్నాయని తెలిపారు. కార్మికుల వేతనాలు కూడా అదే నిధులతో చెల్లిస్తున్నారని చెప్పారు. మండలానికి రూ.2.25 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. కాంగ్రెస్ నాయకుల ప్రచారాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధికి నిధులు లేవని విమర్శించారు. కార్యక్రమంలో నరసయ్య, గుర్రం రేణుక పాల్గొన్నారు. మాడ వెంకటరెడ్డి, అలివేలు సమ్మిరెడ్డి, దండు కొమురయ్య హాజరయ్యారు. గంట మహిపాల్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


