విజేత విక్రమ్ ప్రమాణ స్వీకారం
కాకతీయ, చెన్నారావుపేట : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోత్ విక్రమ్ సర్పంచ్‌గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకార అనంతరం ప్రత్యేక అధికారుల నుంచి పాలకవర్గ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రమాణ స్వీకారం చేసిన వార్డు మెంబర్లు కూడా గ్రామాభివృద్ధిలో ముందుండి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు నూతన పాలకవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు సర్పంచ్ బానోత్ విక్రమ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గణేష్, శంకర్, శ్రీను, హరికిషన్, జాన్ నాయక్, శ్రీరామ్, బద్రు, జెత్య నాయక్, రాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


