- ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు
- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
- సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు
కాకతీయ, తెలంగాణ : విజయదశమి పురస్కరించుకుని డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “విజయ దశమి సందర్భంగా ఆర్ అండ్ బి,సినిమాటోగ్రఫీ శాఖల అధికారులు,ఉద్యోగులు,తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చెడుపై.. మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటాం.
ప్రజా ప్రభుత్వంలో ఆ దుర్గామాత ఆశీర్వాదాలతో ప్రతి ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం నెలకొనాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించా.. అని మంత్రి కోమటి రెడ్డి పేర్కొన్నారు.
అంతకు ముందు మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో వాహన, ఆయుధ పూజ నిర్వహించారు. కార్యక్రమంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి,సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం.డి సిహెచ్.ప్రియాంక, ఆర్ అండ్ బి ఈఎన్సిలు మోహన్ నాయక్, జయ భారతి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రేమ్ పలువురు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.


