epaper
Monday, January 19, 2026
epaper

చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్..

చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్..

45 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్ టోర్నీ

జపాన్ క్రీడాకారిణి కిమికో రికార్డ్‌ను బద్దలు కొట్టిన ఘ‌న‌త‌

కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చరిత్రలోనే సింగిల్స్ ఆడిన అత్యంత పెద్ద వయసున్న మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. 45 ఏళ్ల వయసులో ఆమె ఈ టోర్నీ ఆడి ఈ అరుదైన ఘనతను అందుకుంది. ఈ క్రమంలో ఆమె జపాన్‌కు చెందిన కిమికో డేట్ (44 ఏళ్లు) రికార్డ్‌ను బద్దలు కొట్టింది. వీనస్ విలియమ్స్ ర్యాంక్ 576 కాగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమె ఈ టోర్నీ‌లో ఆడింది. మహిళల సింగిల్ తొలి రౌండ్ మ్యాచ్‌లో వీనస్ విలియమ్స్ 7 6, 3 6, 4 6 తేడాతో సెర్బియాకు చెందిన ఓల్గా డానిలో‌విచ్ చేతిలో ఓటమిపాలైంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌‌ను వీనస్ విలియమ్స్ తృటిలో చేజార్చుకుంది. తొలి సెట్ గెలిచిన ఆమె రెండో సెట్‌లో ఓటమిపాలైంది. మూడో సెట్‌లో 4 0తో ఆధిక్యంలో నిలిచి ఆధిపత్యం చెలాయించింది. కానీ ప్రత్యర్థి ఓల్గా పుంజుకొని వీనస్ విలియమ్స్‌ను మట్టికరిపించింది. 1998లో 17 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్‌లోకి అరంగేట్రం చేసిన వీనస్ విలియమ్స్.. తొలి టోర్నీలోనే క్వార్టర్స్‌కు చేరుకుంది. గత 28 ఏళ్లుగా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్నా.. టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2003, 2017లో ఫైనల్ చేరినప్పటికీ.. తన సోదరి సెరెనా విలియమ్స్ చేతిలో ఖంగుతిన్నది. తాజా ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో వీనస్ సింగిల్స్‌లో ఓడిపోయినప్పటికీ.. ఎకటెరినా అలెక్సాండ్రోవాతో కలిసి డబుల్స్ విభాగంలో పోటీపడుతుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గంభీర్.. నీకో దండం!

గంభీర్.. నీకో దండం! టీమిండియాను వదిలేయ్! భార‌త్ క్రికెట్ కోచ్‌పై ఫ్యాన్స్ ఫైర్ హెడ్ కోచ్...

ఫామ్​లోనే రోహిత్

ఫామ్​లోనే రోహిత్ ఒక్క సిరీస్ ప్రదర్శన ఆధారంగా విమ‌ర్శించ‌డం త‌గ‌దు హిట్​మ్యాన్​కు ​గిల్ మద్దతు కాక‌తీయ‌,...

ఫీల్డింగే ముంచింది

ఫీల్డింగే ముంచింది మిడిల్ ఓవర్లలో ఫీల్డర్ల ఉదాసీనత చాలా తేలికగా సింగిల్స్ ఇచ్చేశారు బౌలర్లు సృష్టించిన...

తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి‌పై వేటు

తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి‌పై వేటు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టు కాక‌తీయ‌,...

డెర్బీలో క్యారిక్ డబుల్ దెబ్బ!

డెర్బీలో క్యారిక్ డబుల్ దెబ్బ! సిటీపై 2–0 గెలుపుతో యునైటెడ్‌లో కొత్త ఊపిరి తొలి...

భారత్‌కు రాలేం!

భారత్‌కు రాలేం! టీ20 వరల్డ్‌కప్‌పై బంగ్లా బోర్డు కఠిన వైఖరి శ్రీలంకకు మ్యాచ్‌లు తరలించాలని...

‘సెహ్వాగ్‌, యువరాజ్‌ దగ్గర నుంచి రూ.కోట్లు రాలుతాయి!’

‘సెహ్వాగ్‌, యువరాజ్‌ దగ్గర నుంచి రూ.కోట్లు రాలుతాయి!’ సరదాగా వ్యాఖ్యానించిన మొహమ్మద్ కైఫ్ కపిల్...

రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం వెనుక‌ గంభీర్ హస్తం?

రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం వెనుక‌ గంభీర్ హస్తం? సంచలన ఆరోపణలు చేసిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img