మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై వేములవాడ ఏఎస్‌పీ సమీక్ష
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను వేములవాడ ఏఎస్‌పీ రుత్విక్ సాయి ఐపీఎస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు.అనంతరం ప్రోటోకాల్ కార్యాలయంలో ఆలయ ఈవోను జాతర ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఏఎస్‌పీ సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎల్. రమాదేవి, ఈఈ రాజేష్, వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు


