నిరుపేద కుటుంబానికి వారాహి ఫౌండేషన్ అండ
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన అందేశ రమేష్–భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు అభిరామ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవల మృతిచెందాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని వారాహి ఫౌండేషన్ ప్రతినిధులు పరామర్శించారు.వారాహి ఫౌండేషన్ డైరెక్టర్ చిలుకమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ కుడికాల భాస్కర్, డైరెక్టర్లు కలిసి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత నిరుపేద స్థితిలో ఉన్న ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వారాహి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుడికాల భాస్కర్, డైరెక్టర్లు చిలుకమారి శ్రీనివాస్, జినుకల లక్ష్మణరావు పటేల్, ఇప్పకాయల సాగర్, మమునూరి ప్రవీణ్, తుని సమ్మయ్య, కొత్తూరి జీవన్, మాడుగుల సురేష్, సంఘాల రాజు, మైస కొమురయ్య, ఎడ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


