వివాహ వేడుకలో వందేమాతరం గేయం…
కాకతీయ, వరంగల్ సిటీ : బంకింగ్ చంద్ చటర్జీ వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్ళు అయినందుకు గాను నేడు అనగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఓ వివాహ వేడుకలో సామూహిక వందేమాతర గీతాలాపన చేసి దేశభక్తిని చాటుకున్నారు. నగరంలోని రంగశాయి పేటకు చెందిన కానిస్టేబుల్ గోగికార్ శ్రీకాంత్ లక్ష్మిసాయి ల వివాహం శుక్రవారం మామూనూరు వద్ద గల హెచ్ఆర్ఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. అనంతరం ప్రతీ ఒక్కరు హక్కులను పొందినట్లే ప్రాథమిక విధులను అదేశిక సూత్రాలను పాటించాలనే ఉద్దేశ్యంతోనే వివాహ వేడుకల్లో వందేమాతరం పాడించామని పెళ్ళిపెద్దలు తెలిపారు. వివాహ వేడుకలో దేశభక్తితో చేపట్టిన కార్యక్రమం పట్ల పలువురు అధికారులు, ప్రముఖులు అభినందలు తెలుపుతున్నారు.


