ప్రభుత్వ పాఠశాలల్లోనే విలువలతో కూడిన విద్య
తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి
‘మోదీ గిఫ్ట్’గా 10వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ
ప్రభుత్వ పాఠశాలలకు గ్రామస్తుల సహకారం అవసరం
10/10 జీపీఏతో ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వాలని పిలుపు
నూతన సర్పంచులకు ఘన సన్మానం
కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు విలువల బోధ జరుగుతుందని తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘మోదీ గిఫ్ట్’ పేరిట 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న సైకిళ్లను గురువారం నల్లగొండ జడ్పీ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగదీశ్వరాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్వరాచారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు సంస్కారాలు, విలువలు బోధించబడుతున్నాయని అన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామస్తులు అందరూ సహకరించాలని కోరారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తే భవిష్యత్ మరింత उज్వలంగా ఉంటుందని విద్యార్థులకు సూచించారు.
మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం
10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సహాయం అందిస్తామని నల్లగొండ, మక్తపల్లి సర్పంచులు ప్రకటించారు. ‘మోదీ గిఫ్ట్’గా అందిన సైకిళ్లకు ప్రతిగా 10/10 జీపీఏ సాధించి కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన నల్లగొండ సర్పంచ్ జింక మారుతి, మక్తపల్లి సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్, బాలయ్యపల్లి సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్‌లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఈసీ చింతం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మార్క హరి, ఓబీసీ అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతం వరలక్ష్మి, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు గడ్డం అరుణ్, వార్డు సభ్యులు నారాయణపురం తిరుపతి, జాడి రాజు, స్థానిక బీజేపీ కార్యకర్తలు గాండ్ల రాము, ప్రదీప్ రెడ్డి, సాయి కృష్ణ, జక్కుల ప్రశాంత్, సుగుణాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


