కాకతీయ, ములుగు ప్రతినిధి : హనుమకొండ వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల వృక్షశాస్త్ర విభాగ విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటన లో భాగంగా పాలంపేట గ్రామ పరిసరాల్లోని కేన్ రక్షిత ప్రాంతాన్ని సందర్శించి సమగ్ర అధ్యయనం గావింసందర్భంగా “కేన్ మాన్ ఆఫ్ తెలంగాణ”గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ సుతారి సతీష్ విద్యార్థులకు కేన్ మొక్కల జీవవైవిధ్యం, వాటి పర్యావరణ ప్రాధాన్యం, తెలంగాణలో అరుదుగా లభించే ఈ మొక్కల ప్రాంతాన్ని సంరక్షించాల్సిన అవసరాన్ని వివరించారు. పర్యటనలో భాగంగా విద్యార్థులు యునెస్కో వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయంతో పాటు సమీప సరస్సులను సైతం సందర్శించారు. ఆలయ గైడ్ విజయ్ కాకతీయుల శిల్పకళా వైభవం, గొలుసు కట్టు చెరువుల ప్రత్యేకతలను విద్యార్థులకు వివరించారు. తదుపరి, విద్యార్థులు ఏటూరునాగారం అభయారణ్యంతో పాటు బ్లాక్బెర్రీ ఐలాండ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దేశీయ మొక్కల ప్రాముఖ్యత, అడవుల జీవావరణ పాత్ర, జీవవైవిధ్యం, ఔషధ మొక్కల వినియోగం, గిరిజన జాతులు స్థానిక మొక్కలను వైద్యపరంగా ఉపయోగించే పద్ధతులపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ హరేంధర్ రెడ్డి, కవిత, రమేష్, యాకూబ్ పాషా, మోహన కృష్ణ, సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు.


