చొప్పదండి మున్సిపాలిటీ చైర్మన్‌గా వడ్లూరి సరిత ఎన్నిక
కాకతీయ, కరీంనగర్ : చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగింది. తాజాగా జరిగిన చైర్మన్ ఎన్నికలో వడ్లూరి సరిత–శ్రీనివాస్ (కాంగ్రెస్) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా పెరుమాండ్ల మానస–గంగయ్య గౌడ్ (కాంగ్రెస్) బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ, చైర్మన్ ఎన్నికలో కూడా తన బలం నిరూపించి మున్సిపాలిటీ పాలనపై పూర్తి నియంత్రణ సాధించింది. ఈ పరిణామంతో చొప్పదండి స్థానిక రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభావం మరింత బలపడింది. స్థానిక అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై కొత్త పాలకవర్గం దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.



