కాకతీయ, పెద్దవంగర : పాలకుర్తి మండలకేంద్రంలోని బసారత్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించే ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, హనుమండ్ల ఝాన్సీరాజేందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. కంటి వైద్య పరీక్షలకు వచ్చేవారు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, ఫోన్ నంబర్, వాడుతున్న మందులు వెంట తీసుకురావాలన్నారు. కంటి ఆపరేషన్ తోపాటు భోజనం, వసతి అన్నీ శంకర కంటి ఆసుపత్రి కల్పిస్తుందని తెలిపారు.


