ప్లాస్టిక్ వినియోగం నిషేధించాలి
: జిల్లా కలెక్టర్ డా. సత్య శారద
మద్ది మేడారం జాతర ఏర్పాట్ల పరిశీలన
నల్లబెల్లి, కాకతీయ : వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి గ్రామ పరిధిలోని మద్ది మేడారం ప్రాంతాన్ని సందర్శించారు. జాతర నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జాతర సమయంలో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరను ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో కృష్ణ, ఎంపిడిఓ శుభ నివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.


