కాకతీయ, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తిలో రైతులకు యూరియా పంపిణీ చేసే సెంటర్ ను జిల్లా ఎస్పి సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రైతులందరికీ యూరియా అందించే విధంగా అధికారులందరూ సమన్వయంతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
రైతులు ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు క్లస్టర్ వైస్ విధానాన్ని అమలు చేస్తూ వరుస క్రమంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వదంతులను అన్నదాతలు నమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై కరుణాకర్,ఏవో మహేందర్, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.


