పట్టణాభివృద్ధే లక్ష్యం
చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్
కాకతీయ, నర్సంపేట టౌన్: పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని నర్సంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. మున్సిపల్ పరిధిలో ప్రజల సమస్యలను తెలుసుకునే భాగంగా శనివారం 3వ వార్డులో పర్యటించారు. కౌన్సిలర్ ముత్తినేని వెంకన్నతో కలిసి చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా వార్డులోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. చైర్‌పర్సన్ మాట్లాడుతూ… వార్డులో పర్యటిస్తున్న సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తిస్తున్నామని తెలిపారు. స్థానిక కౌన్సిలర్ ముత్తినేని వెంకన్న తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పరిష్కరిస్తామని చెప్పారు. పట్టణంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి, శానిటేషన్ ఎస్సై శ్యామ్, వాటర్ సప్లై ఇంచార్జ్ కాట శ్రీను, వార్డు ఆఫీసర్ యుగేందర్, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు లోడే రాజు, కంచు రవి, పూజారి సారంగం, కంచర్ల వెంకన్న, దండిగ రమేష్, పోతేరాజు బాబు, జన్ను మురళీ, వేల్పుల కృష్ణ, కోరే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


