epaper
Monday, March 2, 2026
epaper

కొత్తగూడెం బీఆర్‌ఎస్‌లో కలకలం

కొత్తగూడెం బీఆర్‌ఎస్‌లో కలకలం
కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజుకుంటున్న రాజకీయ రగడ
త‌న‌ను ఇంటికి పిలిపించి కులం పేరుతో దూషించాడు
వ‌న‌మా రాఘ‌వ‌పై బీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త చందు నాయక్ ఆరోప‌ణ‌లు
ప్రాణహాని ఉందంటూ ఆందోళన

కాకతీయ ప్రతినిధి, కొత్తగూడెం : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ నేడో–రేపో విడుదల కానున్న నేపథ్యంలో కొత్తగూడెం రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తుండగా, కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీలో ప‌నిచేసిన‌ సస్పెండెడ్ యువనేత వ‌న‌మా రాఘ‌వ‌ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారిందన్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. త‌న‌ను ఇంటికి పిలించి కులం పేరుతో దూషించ‌డాని పాల్వంచకు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త చందు నాయక్ బీఆర్ఎస్ స‌స్పెడెడ్ నేత వ‌న‌మా రాఘ‌వను ఉద్దేశించి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కార్పొరేషన్ ఎన్నికలపై చర్చిద్దామనే నెపంతో తనను యువనేత ఇంటికి పిలిపించారని, అక్కడ తీవ్రంగా అవమానించారని చందు నాయక్ వీడియోలో వాపోయారు.

‘పార్టీ టికెట్ నీకెలా వస్తుంది?’

వీడియోలో చందు నాయక్ మాట్లాడుతూ… గతంలో తాను జలగం వెంకట్రావు కోసం పని చేశానని, ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు రేఖ కాంతారావు కోసం పనిచేస్తున్నానని చెప్పడంపై ఆ యువనేత ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. “నీకెట్లా పార్టీ టికెట్ వస్తుంది?” అంటూ తన కులాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, తనను పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ కేటీఆర్ తన ఇంట్లో భోజనం చేస్తారని, కార్పొరేషన్ ఎన్నికల్లో తాను ఆమోదించిన పేర్లే ఫైనల్ అవుతాయని యువనేత ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని చందు నాయక్ వీడియోలో పేర్కొన్నారు. తనను కాదని ఎవరికీ పార్టీ టికెట్ రాదన్నట్లుగా మాట్లాడారని వాపోయారు.

ప్రాణహాని ఉందంటూ ఆందోళన

గతంలోనూ ఆ యువనేత చేసిన అరాచకాలను గుర్తు చేస్తూ, త్వరలో తమ కుల సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తామని చందు నాయక్ తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ, సోషల్ మీడియా వేదికగా సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను వెలిబుచ్చారు. ఈ ఘటన బీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, కార్పొరేషన్ ఎన్నికల వేళ ఈ వ్యవహారం పార్టీకి ఎంతవరకు నష్టం కలిగిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన

ఇండ్ల మధ్య సెల్ టవర్లు... ప్రజల్లో ఆందోళన రేడియేషన్ భయం... అనుమతులపై అనుమానాలు సాయినగర్‌లో...

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ కాకతీయ, కారేపల్లి: ఖమ్మం...

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...

మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ

మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామ...

కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్

కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్ కాకతీయ, కారేపల్లి: కరువు కాటుతో పంటలు...

పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా

పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా 14 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరి...

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img