ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు 25 వరకు దరఖాస్తుల ఆహ్వానం
కాకతీయ, పెద్దవంగర : మండలంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2025-26సంవత్సరానికి సంబంధించి ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం ఈ నెల 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు.ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించాలని హెచ్‌ఎంలకు సూచించారు. www.telangana.epas-s.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని ఆయన పేర్కొన్నారు


