కాకతీయ, కరీంనగర్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్రాక్టర్ నడిపారు. గణేష్ నిమజ్జన వేడుకల సందర్బంగా కేంద్ర హొం శాఖ సహయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని మహశక్తి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన గణేష్ మండలంలో ప్రత్యేక పూజాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా భక్తులతో కలిసి బండి సంజయ్ స్వయంగా గణేష్ విగ్రహన్ని ట్రాక్టర్‌లో ప్రతిష్టించి, ఆ వెంటనే ట్రాక్టర్ ఏక్కి కొద్ది దూరం డ్రైవింగ్ చేశారు. మరో వైపు కరీంనగర్ లో నిమజ్జన వేడుకలు ఘనంగా ప్రారంభమైయ్యాయి, అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం బండి సంజయ్ టవర్ సర్కిల్ వచ్చి నిమజ్జన వేడుకల కార్యక్రమాలలో పాల్గొననున్నారు.


