కాకతీయ, కరీంనగర్ : బీజేపీ ఏడవ డివిజన్ హౌసింగ్ బోర్డ్ మాజీ కార్పొరేటర్, పార్టీ నేత తోట సాగర్ ఇటీవల మైల్డ్ హార్ట్ స్ట్రోక్‌తో అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఢిల్లీ నుంచే ఫోన్‌లో మాట్లాడి ఆయనను ధైర్యపరుస్తూ, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
ఆదివారం బండి సంజయ్ స్వయంగా తోట సాగర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ ఈస్ట్ జోన్ నాయకులు, హౌసింగ్ బోర్డ్ కాలనీ పెద్దలు, ప్రముఖులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


