కాకతీయ, కరీంనగర్ బ్యూరో : శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల భాగంగా సోమవారం రోజున కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఉత్సవాల ప్రారంభానికి వేద పండితులు స్వస్తి పుణ్యహవాచనం, మాతృక పూజ, అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ పాల్గొని అమ్మవారి దీక్షను స్వీకరించారు.


