కాకతీయ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి జారిపడి మరణించాడు. రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి నుంచి న్యూ నెహ్రూ స్ట్రీట్ వైపు నుంచి రైల్వే ట్రాక్ వెళ్లే దారిలో ఓ వ్యక్తి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు అతని మహబూబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.
అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో ఏరియా ఆసుపత్రి మార్చురిలో భధ్రపరిచినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. 87126 56940 SI డోర్నకల్ , 8712584572 PS డోర్నకల్, 87126 56942 మ్రుతునికి సంబంధించిన వివరాలను తెలపాలని డోర్నకల్ రైల్వే సిఐ కోరారు.


