కమలాపురం ఇంటెక్ వెల్ వద్ద గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం
కాకతీయ, ఏటూరునాగారం :ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని గోదావరి నది ఇంటెక్ వెల్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడంతో ప్రాంతంలో కలకలం రేగింది. చేపల వేటకు వెళ్లిన కొందరు స్థానికులు ఇంటెక్ వెల్ వద్ద మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న స్థానికులు గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసినట్లు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వివరాలు సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఎవరు, ఎలా మరణించాడన్న అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


