ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన
కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో ఆర్థిక అక్షరాస్యత పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు నవీన్ సాయి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు విద్యార్థులకు తమ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు, బ్యాంకు కు సంబంధించిన సేవింగ్ ఖాతా తెరవడం ఖాతాను ఉపయోగించే వినియోగించడం మధ్య జరుగుతున్నటువంటి సైబర్ మోసాలను అరికట్టడంలో విద్యార్థుల యొక్క పాత్రను అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం వివిధ అంశాలపై వ్యాసరచన, బొమ్మల గీయడం, ఉపన్యాసించడం, క్విజ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య శాస్త్ర ఉపాధ్యాయులు తుమ్మ సతీష్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు


