సీపీఆర్’పై అవగాహన తప్పనిసరి
కాకతీయ, నర్మెట్ట : అకస్మాత్తుగా సంభవించే కార్డియాక్ అరెస్టుల నుంచి సత్వరం బాధితులను కాపాడేందుకు సీపీఆర్ చేయడం తప్పనిసరని 108 ఈఎంటి టెక్నీషియన్ వనజ అన్నారు. అందుకోసం సీపీఆర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. శుక్రవారం నర్మెట్ట గ్రామపంచాయతీ ఆవరణలో సీపీఆర్ ఎలా చేయాలో గ్రామపంచాయతీ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఆర్ అనేది కార్డియాక్ అరెస్టు ను ఎదుర్కొంటున్న సమయంలో ఊపిరి పీల్చటంలో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు లైఫ్ సేవింగ్ టెక్నిక్ గా ఉపయోగపడుతుందన్నారు. గుండె పై భాగంలో ఉండే స్టర్నమ్ అనే ఎముక వద్ద ప్రెషర్ ఇచ్చి, గుండెను స్టిమ్యూలేట్ చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఎక్కువ ప్రెషర్ ఇస్తే ఎముక విరిగే అవకాశం ఉందన్నారు. అలాగని వీక్ గా చేస్తే ప్రెజర్ సరిపోదన్నారు. ఒక మోతాదులో చేయటాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇది ప్రథమ చికిత్స లాంటిదని ప్రాణాలను నిలుపుతోందని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది 108 పైలెట్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


