శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో
ఆరోగ్య అవగాహన సదస్సు
800 మంది విద్యార్థినులకు శానిటేషన్ కిట్లు
పదో తరగతి విద్యార్థినులకు పరీక్షా సామాగ్రి
కాకతీయ, గజ్వేల్ : శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినిల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ట్రస్ట్ విజన్- 1 కార్యక్రమంలో భాగంగా సోమవారం ములుగు మండల నగర శివారులోని లక్ష్మక్కపల్లి గ్రామంలోని విపిజే ఫంక్షన్ హాల్‌లో మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థినుల కోసం ఆరోగ్య అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్విఎం హాస్పిటల్‌కు చెందిన అనుభవజ్ఞులైన స్త్రీ వైద్య నిపుణులు విద్యార్థినులకు ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, శానిటేషన్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్థినులకు పరీక్షలకు ఉపయోగపడే సామాగ్రి, శానిటేషన్ కిట్లను పంపిణి చేశారు. మండలంలోని సుమారు 800 మంది విద్యార్థినులకు శానిటేషన్ కిట్లను అందజేస్తున్నామని శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు విష్ణు జగతి తెలిపారు. ఈసందర్భంగా వైద్యులను, ఉపాధ్యాయులను శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి గంప ఆంజనేయులు, జాయింట్ సెక్రెటరీ మొగిలి రాజశేఖర్ రెడ్డి, మీడియా ప్రతినిధి బచ్చు చంద్రశేఖర్, సభ్యులు కోలా భాస్కర్, ఆర్విఎం హాస్పిటల్ వైద్యురాళ్లు డాక్టర్ పోషాల ప్రజ్ఞ, డాక్టర్ ఎస్ తేజస్వి, డాక్టర్ దీప్షిక, ఎంఈఓ ఉదయ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు బి రవికుమార్, హెచ్‌ఎం క్షీరసాగర్, ఎం కవితాదేవి, హెచ్‌ఎం ఆర్ అండ్ ఆర్ కాలనీ, డి నాగరాణి, వీణ, శోభారాణి, రజిని కుమారి, ఆర్విఎం మార్కెటింగ్ సిబ్బంది గౌరవ డాక్టరేట్ మంచినీళ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


