అండర్ డ్రైనేజీ పనులను పూర్తి చేయాలి
జాప్యానికి కారణాలేంటో పరిశీలించాలి
అధికారులకు మంత్రి సురేఖ ఆదేశాలు
కాకతీయ, ఖిలావరంగల్ : శివనగర్ 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ విజ్ఞప్తి మేరకు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బజ్వా, మున్సిపల్ అధికారులతో కలిసి అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ డ్రైనేజీ పనులు జాప్యానికి గల కారణాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్‌కు సూచించారు. ఈ పనుల వల్ల చుట్టూ పక్కల ప్రాంతాల ప్రజలు రైల్వే స్టేషన్, బస్సు స్టాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారి కావున ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఈ సంతోష్, కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్, టీపీసీసీ కార్యదర్శి కొత్తపెల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్, శ్రీరాం రాజేష్, ఎండీ అబ్జాల్, చిన్న పటేల్, పూరిల్లి సతీష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.


