ఏసీబీకి పట్టుబడిన మామడ ఎస్సై ..
రూ. 20 వేలు తీసుకుంటూ దొరికిపోయిన తీగల అశోక్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. రూ. 20 వేల లంచం తీసుకుంటూ ఎస్సై తీగల అశోక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి రూ. 40 వేల లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఈమేరకు గురువారం 20 వేలు తీసుకుంటూ దొరికిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


