పట్టణ పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీలు
కాకతీయ, కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, పీఓ–ఎన్సీడీ సప్తగిరి కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాజరు రిజిస్టర్, అవుట్‌పేషెంట్ రిజిస్టర్‌తో పాటు కీలక వైద్య పత్రాలను పరిశీలించారు.ఏఎన్ఎం వారీగా ఆరోగ్య కార్యక్రమాల అమలు, సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఎన్సీడీ క్లినిక్‌లో అధిక రక్తపోటు, మధుమేహ రోగుల వివరాలు నమోదైన బ్లూ, రెడ్ రిజిస్టర్లను తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న మందుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఫార్మసీలో సీజనల్ వ్యాధుల మందుల నిల్వలను కూడా పరిశీలించారు.30 ఏళ్లు పైబడిన వారందరికీ రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ అయిన వారిని ప్రభుత్వ ఉచిత మందులు వాడేలా ప్రోత్సహించాలని అధికారులు సూచించారు. పిల్లల టీకాల కోసం ఉన్న ఐఎల్ఆర్ ఫ్రీజర్ మరియు దాని రోజువారీ ఉష్ణోగ్రత రికార్డులను పరిశీలించారు. ఐఇసీ బోర్డులో ప్రదర్శించిన రక్తపోటు–మధుమేహ మందుల నమూనాలను కూడా పరిశీలించారు.మహిళ హెల్త్ క్యాంపులలో రీస్క్రీనింగ్‌ను 100% పూర్తి చేయాలని, రిఫరల్ కేసులను ఫాలోఅప్ చేస్తూ సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు.ఈ తనిఖీల్లో పీఓ,ఎన్సీడీ ఉమాశ్రీ, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సాఫీర్ హుస్సేన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


